జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నఅమితాబ్
- February 03, 2016
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. దిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ కార్యక్రమంలో బిగ్‌బీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వయసులో కూడా విభిన్న పాత్రలు చేయగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఐదు తరాల నటీనటులతో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ ఆయన కుటుంబ సభ్యులు జయా బచ్చన్, శ్వేతా పండిట్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం అమితాబ్ నవాజుద్దీన్ సిద్దిఖి, విద్యా బాలన్‌తో కలిసి తీన్ సినిమాలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







