బుదయలో మిలియన్ దినార్ల వ్యయంతో మరీనా పార్క్
- February 03, 2016
బహ్రైన్ మరీనా అభివృద్ధి సంస్థ ఒక ఆక్వా పార్క్ , జెట్ స్కైస్ , స్కూబా డైవింగ్ మరియు ఫెర్రీ సేవలను ఒకే
ప్రాంతంలోనే ఉండేవిధంగా ఒక నూతన బహుళార్ధక మిలియన్ దినార్ల పార్క్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభించనుంది.
ఉత్తర పురపాలక సమాఖ్యచే ఆమోదించబడిన ఈ ప్రాజెక్ట్ ను బుదయ సముద్ర తీర రేఖ సమీపంలో మరీనా పార్క్
నిర్మించబడనున్నట్లు మునిసిపల్ ఉన్నతాధికారి యూసఫ్ అల్ ఘటం తెలిపారు. సువిశాల సముద్ర తీరం తమ
పురపాలక పరిధిలో ఉన్నప్పటకి సరిగా వినియోగించుకోలేక పోయామని గతంలో అందుకు తగిన నిధులు లేవని
చెబ్తూ, బహుళార్ధక మిలియన్ దినార్ల పార్క్ ప్రాజెక్ట్ ద్వారా పురపాలక ఆదాయం క్రమేపి పెంచుకోవడమే కాక
పర్యాటకులను ఆకర్షించగలమనె భావన తమకు కలుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







