అబుదాబీ లో 700 బహుళ అంతస్థుల వాహన పార్కింగ్ ప్రదేశాలు
- February 03, 2016
తొలి బహుళ అంతస్థుల వాహన పార్కింగ్ ప్రదేశాలు ఫాతిమా బింట్ ముబారక్ మరియు ఫలహ్ వీధులలో ప్రజల సౌకర్యార్ధం తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు. 3 అంతస్థుల భూగర్బ సదుపాయం , రవాణా సమాచారం స్మార్ట్ ఫోన్ ద్వారా అక్కడ ఉన్న ప్రెదెశ లభ్యత వివరాలు వాహానదారులకు అందచేస్తారు.బహుళ అంతస్థుల వాహన పార్కింగ్ ప్రదేశాల నిర్మాణం కొరకు మూడేళ్ళ కాలం పట్టడమే కాక, 720 మిలియన్ల దీనార్ల వ్యయం చేయబడటం విశేషం. ఇందులో 726 వాహనాలను నిలిపి ఉంచేందుకు వీలు ఉంది. అంతేకాక ఎంతో పటిష్టమైన భద్రతా నిఘా సైతం ఏర్పాటు చేశారు. రానున్న వేసవికాలంలో అబుదాబీ వాహన పార్కింగ్ ప్రదేశాల సమాచారం ' దర్బ్ అప్ ' ద్వారా అనుసంధానం చేయబడుతుంది.దీని ద్వారా వివిధ పార్కింగ్ ప్రదేశాలలో వాహన పార్కింగ్ కు ఏ మేరకు అవకాశం ఉందో సమయ సమాచారం తెలుసుకునే వీలు కలుగుతుంది. ఈ నిర్మాణాలు చూడచక్కని విధంగా ఏర్పాటు చేయబడి కుటుంబసమేతంగా ఇక్కడకు వచ్చే విధంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పిల్లలు ఆటలాడుకునేవిధంగా తీర్చిదిద్దడం మరో ప్రత్యేక ఆకర్షణ అని మవకిఫ్ డివిజన్ జనరల్ మేనేజర్ మహమ్మద్ హమీద్ బిన్ ఫహద్ అల్ ముహైరి ఇటీవల గల్ఫ్ న్యూస్ ప్రారంభోత్సవంలో తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







