బంగారం దిగుమతులు: ట్యాక్స్ నిర్ణయం బ్యాక్ ఫైర్
- February 03, 2016
బంగారం దిగుమతులకు సంబంధించి భారత ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనలు బెడిసికొడుతున్నాయి. అక్రమ బంగారం దిగుమతులు భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా తయారైంది. ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్ళు జరిపేవారికి సంబంధించి 'ట్యాక్స్ కోడ్' విధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చాక ఈ అక్రమ బంగారం రవాణా మరింతగా పెరిగిపోయింది. జనవరి 1 నుంచి 2,00,000 రూపాయల పైన విలువ చేసే బంగారం కొనదలచుకుంటే ప్యాన్ నంబర్, ట్యాక్స్ కోడ్ని సమర్పించవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బంగారం వ్యాపారులూ అక్రమ బంగారం వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. పాన్ కార్డ్ లేని వినియోగదారులు కొనుగోళ్ళకు వెనుకాడుతుండడంతే బంగారం వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనివారి నుంచే బంగారం డిమాండ్ ఉంటోందని వ్యాపారులు చెబుతున్నారు. నిబంధనలెలా ఉన్నా, బంగారం కొనుగోళ్ళు తప్పడంలేదు. దాంతో అక్రమ బంగారం వినియోగానికే అవకాశాలెక్కువవుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







