మోసపూరితమైన టెక్స్‌ట్‌ మెసేజ్‌లపై అప్రమత్తంగా వుండాలి

- July 06, 2020 , by Maagulf
మోసపూరితమైన టెక్స్‌ట్‌ మెసేజ్‌లపై అప్రమత్తంగా వుండాలి

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, సిటిజన్స్‌ అలాగే రెసిడెంట్స్‌ ‘ఫ్రాడెంట్‌ మెసేజ్‌లపై’ అప్రమత్తంగా వుండాలని సూచించింది. బ్యాంక్‌ కార్డులు బ్లాక్‌ అయిపోతాయంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు కొందరు స్కామర్స్‌. ఆ మెసేజ్‌ల పట్ల స్పందిస్తే, బ్యాంకు వివరాలు స్కామర్స్‌ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ తరహా మోసపూరిత మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, డిపార్ట్‌మెంట్‌ హాట్‌లైన్‌ 66815757 అలాగే టెలిఫోన్‌ నెంబర్‌ 2347444కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com