ఏపీలో కొత్తగా 1062 కరోనా పాజిటివ్ కేసులు
- July 08, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కరళా నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1062 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1051 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన మరో 11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,259కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,894 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారినుండి కోలుకుని 11,101 మంది డిశ్చారి అయ్యారు. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 264కు చేరింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







