ఖతార్ వర్సిటీ తాజా గ్రాడ్యూయేట్లకు గుడ్ న్యూస్..విద్యాశాఖలో ఉద్యోగ అవకాశాలు
- July 08, 2020
2020-21 అకాడమిక్ ఇయర్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసే వారికి ఖతార్ ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యాశాఖలో భారీగా ఖాళీల భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఖతార్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటన మేరకు ఫ్రెష్ గ్రాడ్యూయేట్స్ లబ్ధిపొందనున్నారు. ఖతార్ పబ్లిక్ స్కూల్స్ ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో తరగతులను పెంచటం, స్కూళ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో 195 తరగతులు, 240 స్కూల్స్ అదనంగా నిర్మించాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అదే సమయంలో విద్యాశాఖలో ఇటీవల కొందరు టీచర్లు రిటైర్మెంట్ అవటం, మరికొందరు రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పెరగనున్న స్కూళ్లు, తరగతులను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అయితే..ప్రస్తుత ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ప్రధాన్యం కల్పించేలా ఖతార్ వర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన వారినే టీచర్లుగా నియమించనున్నారు. ఇక స్పెషలైజేషన్ విభాగాల్లో మాత్రం నైపుణ్యం, అనుభవం ఉన్న వారిని రిక్రూట్ చేయాలని ఖతార్ ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?