షూటింగ్ పూర్తి చేసుకున్న 'వూపిరి'

- February 03, 2016 , by Maagulf
షూటింగ్ పూర్తి చేసుకున్న 'వూపిరి'

అక్కినేని నాగార్జున, తమన్నా, కార్తీలు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న వూపిరి చిత్ర షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించి అధిక భాగాన్ని ఫ్రాన్స్‌లోని పారిస్‌ నగరంలో చిత్రీకరించారు. ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నటుడు కార్తీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com