తెలంగాణలో:కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు
- July 09, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,410 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 30,946కు చేరింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 7మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 331కు చేరింది. ఇప్పటి వరకు 18,192 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జి కాగా,12,423 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా GHMCలో 918 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్‌లో 67, సంగారెడ్డి 79, వరంగల్ అర్బన్ జిల్లాలో 34, కరీంనగర్లో 32 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23, నల్లగొండ జిల్లాలో 21, నిజామాబాద్ జిల్లాలో 18, సూర్యాపేట జిల్లాలో 10, మహబూబ్‌నగర్ జిల్లాలో 8, మెదక్ జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 12, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8, వికారాబాద్ 5, మహబూబాబాద్ జిల్లాలో 5, వరంగల్ రూరల్ జిల్లాలో 7, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, వనపర్తి, గద్వాల జిల్లాలలో 2 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు కాగా, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, ములుగు, సిద్దిపేట జిల్లాలలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







