ఫస్ట్ కాపీ రెడీ చేసుకుంటోన్న తనీష్ 'మహాప్రస్థానం'

- July 09, 2020 , by Maagulf
ఫస్ట్ కాపీ రెడీ చేసుకుంటోన్న తనీష్ \'మహాప్రస్థానం\'

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మహాప్రస్థానం. ఈ చిత్రాన్ని ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ కాపీ సిద్ధమవుతున్న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లకు మంచి స్పందన వచ్చింది. డీఐ కార్యక్రమాల్లో ఉన్న మహాప్రస్థానం చిత్రాన్ని థియేటర్ లేదా ఓటీటీ లో విడుదల చేసేందుకు అప్పటికున్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని చిత్ర దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు జాని మాట్లాడుతూ...ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీగా మహాప్రస్థానం సినిమా ఉంటుంది. సినిమా ఆద్యంతం ప్రేక్షలను ఒక మూడ్ లోకి, కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.  డీఐ పనులు జరుగుతున్నాయి. ఆల్ మోస్ట్ ఫస్ట్ కాపీ సిద్ధమైంది. త్వరలో పరిస్థితిని బట్టి థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేస్తాం అన్నారు.

రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ - క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ - జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ - కపిల్, ఫైట్స్ - శివ ప్రేమ్, కథా కథనం దర్శకత్వం - జాని

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com