తెలంగాణ:గడిచిన 24 గంటల్లో 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- July 11, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,402కు చేరింది. ఇవాళ ఒక్కరోజే తొమ్మిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే శనివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,714 మంది కోలుకోని డిశ్చార్జ్ కాగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,919కు చేరింది.
కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 348కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12,135 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 11,062 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 9,884మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా GHMCలో 736, రంగారెడ్డిలో 125, మేడ్చల్లో 101 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







