భార‌త్ లో రూ.75వేల కోట్లు పెట్టనున్న గూగుల్

- July 13, 2020 , by Maagulf
భార‌త్ లో రూ.75వేల కోట్లు పెట్టనున్న గూగుల్

భార‌త్ లో భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ఐటీ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ ముందుకొచ్చింది. దాదాపు 10బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ గూగుల్ సంస్థ ప్ర‌క‌టించింది. ఇదే అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో గూగుల్ సంస్థ సీఈవో సుంద‌ర్ పిచ్చై వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు.

భార‌త్ లో రోజు రోజుకు ఐటీ నిపుణుల సంఖ్య పెరిగిపోతుండ‌టం, అమెరికా వంటి దేశాల్లోత‌మ కంపెనీల్లో ఇత‌ర దేశాల నుండి నిపుణుల‌ను తీసుకునేందుకు ఉన్న ప్ర‌తికూల ప‌రిస్థితులు, చైనాపై అంత‌ర్జాతీయ స‌మాజంలో ఉన్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో… భార‌త్ లో పెట్టుబ‌డులు అన్ని ర‌కాలుగా ఉత్త‌మమ‌ని గూగుల్ సంస్థ భావించినట్లు జాతీయ మీడియా క‌థ‌నాలు అభిప్రాయ‌ప‌డింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com