మస్కట్:వశీకరణం, మంత్రవైద్యం పేరుతో మోసం..ముగ్గురు అరెస్ట్

- July 19, 2020 , by Maagulf
మస్కట్:వశీకరణం, మంత్రవైద్యం పేరుతో మోసం..ముగ్గురు అరెస్ట్

మనామా:వశీకరణం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముగ్గుర్ని ఓమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. రాయల్ ఓమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యూరోపియన్, అరబ్ మహిళలు స్థానిక వ్యక్తితో కలిసి మంత్రవైద్యం పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. తమకు వశీకరణం విద్య తెలుసని నమ్మించటంతో పాటు బూత ప్రేత పీడుతులను విముక్తి కలిగిస్తామని, అలాగే తమ మంత్ర విద్యలతో వివిధ రుగ్మతలను తగ్గిస్తామని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నట్లు పోలీసులువెల్లడించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని బూత ప్రేత పీడుతలుగా నమ్మిస్తూ వచ్చారు. వీరి మోసాలపై సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. మంత్రవిద్యలు, మంత్ర వైద్యం అంటూ మోసాలకు పాల్పడే వారిని ప్రజలు నమ్మొద్దని, వారి గురించి వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com