మెడికల్ టూరిజంపై దుబాయ్ ఫోకస్...5 లక్షల మంది టార్గెట్
- July 22, 2020
దుబాయ్:కరోనా మహమ్మారిపై విజయవంతంగా పోరాడుతున్న దుబాయ్ ఆరోగ్య అధికార విభాగం..ఇక మెడికల్ టూరిజంపై ఫోకస్ చేసింది. అనారోగ్యం పాలైన వారికి అత్యుత్తమ చికిత్స అందించగల సత్తా తమకు ఉందని కరోనా మహమ్మారిపై తాము అనుసరించిన విధానాలు మరోసారి రుజువు చేశాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 5 లక్షల మంది రిసీవ్ చేసుకునేలా కసరత్తు చేస్తోంది దుబాయ్ ఆరోగ్య అధికార విభాగం. నిజానికి కరోనా వ్యాప్తి చెందిన తొలినాళ్లలో యూఏఈలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ పోయాయి. అయితే..ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు సమన్వయంతో కరోనాపై చేసిన పోరు సత్ఫలితాలను ఇచ్చింది. ఒక్కరోజులో గరిష్టంగా 900 వరకు కేసులు నమోదవగా..ప్రస్తుతం ఒక్క రోజులో 300 వరకు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు..కరోనాను ఎదుర్కోవటంలో దుబాయ్ ఆరోగ్య శాఖ అనుసరించిన విధానాలతో మృత్యురేటు కేవలం 0.6కి పరిమితం అయ్యింది. అలాగే కరోనా రికవరి రేటు 80 శాతానికిపైగా నమోదవుతోంది. ఇక యూఏఈలో ఇప్పటివరకు 40 లక్షల మందికి కోవిడ్ పీసీఆర్ టెస్టులు నిర్వహించగా..ఒక్క దుబాయ్ లోనే 9.5 మిలియన్ల మందికి పరీక్షలు నిర్వహించి కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగారు. ఈ సక్సెస్ ఫుల్ గ్రాఫ్ తో వైద్య పరంగా మరోసారి సత్తా చాటుకుందని, ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి వైద్య సేవలు అందించేందుకు దుబాయ్ సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు.కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపడుతూనే మెడికల్ టూరిజమ్ పై ఫోకస్ చేసింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..