బహ్రెయిన్:సరైన వీసాదారులకు మాత్రమే ఎంట్రీ..ముందస్తు అనుమతులు రద్దు
- July 23, 2020
మనామా:సరైనా వీసాలు కలిగి ఉన్న ప్రవాసీయులు ఇక బహ్రెయిన్ లోకి వచ్చేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమలులోకి వచ్చినట్లు బహ్రెయిన్ నేషనాలిటి, పాస్ పోర్టు, రెసిడెన్సీ వ్యవహారాల విభాగం అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో చెల్లుబాటులో ఉన్న వీసాదారులు నిరభ్యంతరంగా తిరిగి బహ్రెయిన్ చేరుకునేందుకు మార్గం సుగమమైంది. అయితే..ఈ నిర్ణయం తక్షణ వీసాలు పొందాలనుకునే వారికి మాత్రం వర్తించదు. తక్షణ వీసాలపై బహ్రెయిన్ చేరుకునే వారికి ప్రస్తుతం అనుమతి లేదని, తదుపరి నోటీస్ వచ్చే వరకు ఇదే విధానం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు. అంతేకాదు..విదేశీ నివాసితులకు, బహ్రెయిన్ సందర్శకులకు ముందస్తు అనుమతి ఇస్తూ జారీ చేసిన లేఖను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







