భారత్ లో ఒక్కరోజే 49 వేల కరోనా పాజిటివ్ కేసులు
- July 24, 2020
భారత దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కేవలం వారం రోజుల్లోనే 2.6 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా ప్రతిరోజు 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 50 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12,87,945కు చేరింది. ఇందులో 4,40,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8,17,209 మంది కోలుకున్నారు. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు 30,601 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







