కేటీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర దర్శకుడు బందూక్ లక్షణ్ అరుదైన కానుక
- July 24, 2020
హైదరాబాద్:పుట్టినరోజు ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైనది, అందునా తనువు,మనసు,ఆత్మంతా తెలంగాణే నిండిన కేటీఆర్ బర్త్ డే అంటే యావత్ తెలంగాణ ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. సినిమాపై అంతులేని ప్రేమతో తొలిసారిగా ట్వంటీఫోర్ క్రాఫ్ట్స్ తెలంగాణా వాల్లతో బందూక్ చిత్రాన్ని రూపొందించిన లక్ష్మణ్, కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అరుదైన కానుకని రూపొందించినట్టు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. కేటీఆర్ జన్మదినమైన 24.07.76 రోజుతో కూడిన వివిద కరెన్షీ నోట్లని గత రెండు సంవత్సరాలుగా సేకరించి ఈ 2020 జూలై 24న కేటీఆర్ 44వ పుట్టినరోజున అందజేస్తున్నట్టు తెలిపారు. రూపాయి నోటు, ఐదురూపాయల నోటు, పదిరూపాయలనోటు, ఇరవైరూపాయల నోటు, యాబై రూపాయల నోటు, వంద రూపాయలు అలాగే రెండువందల రూపాయల నోట్ల వరకూ 24.07.76 ఒకే నంబర్ గల నోట్లని సేకరించారు. దీంతో పాటు కేటీఆర్ చింతమడకలో బుడిబుడి అడుగులు వేసింది మెదలు నేటి యువనాయకుడుగా ప్రపంచస్థాయిలో ఎదిగే వరకూ ప్రతీ మధురమైన క్షణాన్ని పోటోల రూపంలో సేకరించి, వాటిని చింతమడకలోని కేసీఆర్ ఇంటి బ్యాగ్రౌండ్తో అందమైన పోటో ప్రేముగా రూపొందించి వాటిలో 240776 అంకె కలిగిన కరెన్షీ నోట్లని పొందుపరిచిన తీరు కేటీఆర్ అభిమానులని అలరిస్తుంది. ఎన్నో ప్రయాసలకి ఓర్చి సేకరించిన ఈ అరుదైన కానుకని కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందజేస్తున్నందుకు బందూక్ లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తిపై ఎంతటి ప్రేమ ఉంటే ఇంతటి ఓర్పుతో సేకరణ చేయగలరో ఊహించుకుంటూనే బందూక్ లక్ష్మణ్ మనసు తెలిసిపోతుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు