బిచ్చగాడు2 తో మరో సెన్సేషన్ కి సిద్దమవుతున్న విజయ్ ఆంథోని..
- July 24, 2020
‘బిచ్చగాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు..తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంథోని . 2016 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. తాజాగా జాతీయ అవార్డు గ్రహీత ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటోని పుట్టినరోజు జూలై 24. ఈ సందర్భంగా తెలుగు, తమిళ భాషలలో బిచ్చగాడు 2 ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదలచేసింది చిత్ర యూనిట్. విజయ్ ఆంథోని అటువైపు నిల్చొని ఉన్న ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన విజయ్ ఆంథోని.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని విజయ్ ఆంటోని భావించి ఆయన నిర్మాతగా మారి విభిన్నమైన చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకులను మెప్పించారు విజయ్. ఆ తర్వాత భేతాళుడు, యముడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి వరుస సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు జాతీయ అవార్డు గ్రహీత ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వంలో విజయ్ ఆంథోని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా రూపొందుతోన్న బిచ్చగాడు 2 తో మరో సెన్సేషన్ కి సిద్దమవుతున్నారు విజయ్ ఆంథోని.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







