దుబాయ్: నెట్టింట్లో వైరల్ అవుతున్న తెలంగాణ యువకుడి 'హార్ట్'
- July 24, 2020
దుబాయ్: పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం దుబాయ్ వచ్చేవాళ్ళు కోకొల్లలు. కొందరు గల్ఫ్ చేరుకున్న తరువాత సరైన ఉపాధి దొరికి జీవితం లో నిలదొక్కుకున్నవారు లేకపోలేదు. అయితే కొందరి కష్టాలు కథలుగానే మిగిలిపోతాయి. కొద్ది రోజుల క్రితం ఒక కార్మికుడు తన భావోద్వేగాన్ని చిత్రరూపంలో తెలిపి అందరి మనసులను దోచేశాడు. మరి ఆ కథేంటో చూద్దాం..
దుబాయ్ లోని డౌన్ టౌన్ ఏరియా లో నివసిస్తున్న ఎమిరాతీ మహిళ నెస్మా ఫరాహత్ కిటికీ వెలుపల కనిపించిన దృశ్యం ఆమె దృష్టిని ఆకర్షించింది. వీధిలో రోడ్లను శుభ్రపరిచే క్లీనర్ చెట్ల నుండి పడిపోయిన రేకులను ఉపయోగించి వీధి ప్రక్కన ఉన్న నడక బాట పై 'హార్ట్' ను గీసాడు. కొద్దిసేపటి తరువాత, అతను దానిని తుడిచివేశాడు. ఆ క్షణం చాలా ఆకర్షణీయంగా కనిపించింది, కానీ, దాని వెనుక ఉన్న భావోద్వేగం మనకు తెలియదు కాబట్టి అది సంతోషకరమైనదై ఉండాలని కోరుకుంటున్నాను”అని ఫరాహత్ చెప్పారు.
అసలు ఎవరు ఈ క్లీనర్?
తెలంగాణా కు చెందిన రమేష్ గంగరాజమ్ గంది 10 నెలల క్రితం దుబాయ్ వచ్చి ఎమ్రిల్ అనే కంపెనీ లో పనిచేస్తున్నాడు. రమేష్ యూఏఈ కు వచ్చే ఒక నెల ముందు వివాహం చేసుకున్నాడు. కాగా, అతని భార్య ఇండియాలోనే ఉన్నారు. చిత్రం తీసిన రోజున, అతను తన విధులను ముగించుకుని తన భార్య గురించి ఆలోచిస్తూ ఆలా హృదయ ఆకారాన్ని గీశాడు.
"నేను నా పనిని ఆనందిస్తున్నాను. ఇది నా మనస్సును బిజీగా ఉంచడానికి నిజంగా సహాయపడింది, కాని ఆ రోజు, నేను నా భార్యను చాలా మిస్ అయ్యా అందువలనే ఆలా ఆ చిత్రం గీసా..కానీ, ఎవరైనా నన్ను గమనిస్తున్నారని నేను అనుకోలేదు...నేను ఆమెతో సమయం గడపాలని కోరుకున్నాను. చాలా మంది ప్రజలు వారు ఇష్టపడేవారిని కోల్పోతున్నారు..నేను కూడా అదే విధంగా బాధ అనుభవిస్తున్నా. నా సోదరులు ఒమాన్ లో పనిచేస్తున్నారు. భారత్ లో నా తల్లిదండ్రులు, భార్య, ఒమాన్ లో నా సోదరులు అంత క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నా” అని రమేష్ చెప్పాడు.
"దురదృష్టవశాత్తు, నా తండ్రి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు, అందువల్ల నేను అతనితో కొంత సమయం గడపడానికి సెలవుపై భారతదేశానికి వెళ్లి ఒక నెలలో తిరిగి నా ఉద్యోగంలో చేరుతాను."
నెట్టింట్లో వైరల్:
నెట్టింట్లో వైరల్ అయిపోతున్న రమేష్ గీసిన ఆ భావోద్వేగ చిత్రాన్ని చూసి ముగ్ధులైన చాలా మంది ప్రజలు రమేష్ ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. "ఆ చిత్రం అందుకున్న శ్రద్ధ నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ చిత్రాన్ని చూసిన ఒకరు నాకు బహుమతి ఇచ్చారు" అని రమేష్ తెలిపాడు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







