తెలంగాణలో 1,989 కరోనా పాజిటివ్ కేసులు
- July 31, 2020
హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,989 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 62,703కు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గురువారం ఒక్కరోజే కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 519కి చేరింది. కరోనా నుంచి కోలుకుని గత 24 గంటల్లో 816 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,796 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో 586 GHMC పరిధిలో వెలుగు చూశాయి. మిగిలిన వాటిలో మేడ్చల్-207, రంగారెడ్డి-205, వరంగల్ అర్బన్-123, కరీంనగర్-116, సంగారెడ్డి-108, మెదక్-45, ఖమ్మం-41, మహబూబ్‌నగర్- 61, నల్గొండ-36, మంచిర్యాల-35, గద్వాల-32, నాగర్ కర్నూలు-30, వరంగల్ గ్రామీణ జిల్లా-30, భద్రాద్రి కొత్తగూడెం-29, ములుగు-27, పెద్దపల్లి-26, సిరిసిల్ల-23, జనగామ-21, సిద్ధిపేట జిల్లా-20 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







