యూఏఈ లేబర్ చట్టాలకు భారతీయ ప్రతినిథుల ప్రశంస
- February 05, 2016
యూఏఈ కొత్త లేబర్ చట్టాలను భారత ప్రతినిథుల బృందం ప్రశంసించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టాలు కార్మికుల రక్షణ కోసం ఉపయోగపడ్తున్నాయని కొనియాడారు ప్రతినిథులు. ఏజెంట్ల మోసాల నుంచి ఈ కొత్త చట్టాలు కార్మికులకు రక్షణ కల్పిస్తాయని ప్రతినిథులు చెబుతూ, కార్మికుల రక్షణ కోసం చట్టాలు తీసుకు వచ్చిన యూఏఈ పాలకులను ప్రశంసించారు. యూఏఈలో 2.6 మిలియన్ల మంది ఇండియన్స్ ఉన్నారు. వీరిలో 65 శాతం మంది కార్మికులని ఫస్ట్ సెక్రెటరీ కమ్యూనిటీ ఎఫైర్స్, ఎంబసీ ఆఫ్ ఇండియా, యూఏఈ దినేష్ కుమార్ చెప్పారు. స్వదేశంలో ఒకరకమైన ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులు, యూఏఈకి వచ్చాక ఏజెంట్ల ద్వారా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తుందనీ ఈ కారణంగా యూఏఈలో వలస కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తుందనీ, ఈ నేపథ్యంలో కొత్త చట్టాలు వారికి ఎంతగానో ఉపశమనం కల్పిస్తాయని అధికారులు చెప్పారు. భారతదేశం కూడా ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని యూఏఈ ప్రతినిథులు, అలాగే యూఏఈలో ఇండియా రాయబారి చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







