"కలర్ ఫోటో" టీజర్ విడుదల చేసిన హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ
- August 05, 2020
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ నుంచి కలర్ ఫోటో అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడులైంది. ప్రముఖ హీరో విజయ దేవరకొండ కలర్ ఫోటో టీజర్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఓ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్న యూనిట్ సభ్యులు, ఇప్పుడు టీజర్ ని కూడా అదే పంధాలో రెడీ చేసి రిలీజ్ చేయడం విశేషం. యూట్యూబ్ లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.
చిత్రం: కలర్ ఫోటో
బ్యానర్: అమృత ప్రొడక్షన్
సమర్పణ: శ్రవణ్ కొంక,
లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
కథ: సాయి రాజేష్ నీలం
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఫైట్స్: ఎ.విజయ్
సహ నిర్మాత : మణికంఠ
లైన్ ప్రొడ్యూసర్ : గంగాధర్
పిఆర్ఒ: ఏలూరు శ్రీను
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







