రోజూ గిల్లే వాడు రెండవ పాట విడుదల
- August 10, 2020
కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం మరియు టారస్ సినికార్ప్ సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న 'ఆర్జీవీ' 'రోజూ గిల్లే వాడు' చిత్రం లోని 2వ గీతం లిరికల్ వీడియోని, ది 09-08-2020, ఆదివారం, అర్ధరాత్రి, మణికొండ మర్రిచెట్టు కింద, తెలుగువన్ ఛానల్ చైర్మన్ శ్రీ రవిశంకర్ గారు వీక్షకులకు, మీడియా ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలోని మొదటి పాట విడుదలైన 2 వారాల్లోనే యూట్యూబ్ లో 20లక్షలమంది పైగా విని ఆనందించారు.
తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన తెలుగుసినీపరిశ్రమనే అవమానిస్తున్న 'తగుల్భాజీదర్శకదయ్యం'
'నమక్ హ రాం'ఘోపాలవర్మకి
ఈ రెండో పాటని అంకితం ఇచ్చినట్లు
కవి,దర్శకుడు జొన్నవిత్తుల తెలియచేశారు. చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేస్తామని తెలిపారు. నటీనట వర్గం: సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, తేజ తదితరులు. సాంకేతికనిపుణులు:
ఛాయాగ్రహణం : వేదాంత్ మల్లాది
కూర్పు : కార్తీక శ్రీనివాస్
కళ : కృష్ణ చిత్తనూర్
పబ్లిసిటీ : ధనీ ఏలే
పీఆర్వో : మధు మాడూరి
సంగీతం : వీణాపాణి
సమర్పణ : వెంకట శ్రీనివాస్ బొగ్గరం
నిర్మాత : బాల కుటుంబ రావు పొన్నూరి
కధ, మాటలు, పాటలు, చిత్రానువాదం మరియు దర్శకత్వం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







