ఏపీలో 9,024 కరోనా కేసులు, 87 మరణాలు
- August 11, 2020
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో 9,024 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్ పద్ధతిలో, 30,908 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,549 కు చేరింది. కొత్తగా 9,113 మంది వైరస్ బాధితులు కోలుకుని మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,54,749 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 87,597 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో కొత్తగా 87 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2203 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,92,619 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







