హైదరాబాద్:మొహర్రం పండుగ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
- August 11, 2020
హైదరాబాద్:ఈ నెలాఖరులో వస్తున్న మొహర్రం పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీలు డి.ఎస్.ఎస్ భవన్ లోని సమావేశ మందిరంలో మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారి తీవ్రత వలన కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్ భాషా ఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, మైనారిటీ సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







