హైదరాబాద్:ప్లాస్మా డొనేషన్ కు మహా స్పందన
- August 11, 2020
హైదరాబాద్:కరోనా బాధితుల ప్రాణాలు నిలిపేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సంయుక్తంగా చేపట్టిన ‘ప్లాస్మా డొనేషన్’కు మహా స్పందన వస్తోంది. కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తుండడంతో వందలాది మంది ప్రాణాలు కాపాడే అవకాశం దక్కుతోంది. https://donateplasma.scsc.in/ ఆన్లైన్ పోర్టల్ మొదలైన వారం రోజుల్లోనే వెయ్యి మంది ప్లాస్మా దాతల జాబితాను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. ఇప్పటికి రక్తం, ప్లాస్మా ఇచ్చేందుకు చాలా మంది ఈ ఆన్లైన్ పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకుంటున్నారు. వారిచ్చిన బ్లడ్ గ్రూప్ ఆధారంగా అవసరార్థులను గుర్తించి ప్లాస్మాను ఇవ్వడానికి మధ్య వారధిగా సైబరాబాద్ పోలీసులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 338 మంది ప్లాస్మా దానం చేసి 500 మందికిపైగా కరోనా రోగుల ప్రాణాలు కాపాడారు. అయితే ఈ సామాజిక ఉద్యమానికి సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలంటూ పిలుపునివ్వడంతో మరింతగా దాతలు పెరగొచ్చని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.500 ఎంఎల్ ప్లాస్మా ఇద్దరి ప్రాణాలు నిలుపుతుంది. ఇవి వారి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు.
సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్‌రూమ్ నంబర్లు: 90002 57058, 94906 17444 రిజిష్టర్ పోర్టల్ లింక్: https://donateplasma.scsc.in/


తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







