తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు నమోదు
- August 12, 2020
హైదరాబాద్:తెలంగాణాలో కొత్తగా 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 22,972 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,897 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 84,544కు చేరింది. తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 654కు పెరిగింది.
కరోనా నుంచి కొత్తగా 1920 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 61,294 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 15,534 మంది హోం ,ఇతర ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంటున్నారు.రికవరీ రేటు దేశంలో 69.79 శాతం ఉండగా, తెలంగాణలో 72.49 శాతంగా ఉంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







