ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల ధరలను సవరించిన ఒమన్
- August 12, 2020
మస్కట్:ప్రవైట్ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ధరలను ఒమన్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సవరించింది. సవరించిన ధరల ప్రకారం గతంలో ఉన్న అదనపు ఛార్జీలను మినహాయిస్తూ కొత్త ధరలను నిర్ధారించింది. ప్రస్తుతం ఒమన్ లో కరోనా నిర్ధారణ కోసం మూడు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆ మూడు రకాల టెస్టులకు సంబంధించి ప్రభుత్వం ఖరారు చేసిన ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి.
1) రియల్ టైం-పీసీఆర్ టెస్ట్ : ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కు ప్రైవేట్ ఆస్పత్రులు RO35 కు మించి వసూలు చేయకూడదు. ఈ విధానంలో ముక్కు నుంచి శాంపిల్ సేకరిస్తారు. రెండు గంటల్లో టెస్ట్ రిజల్ట్ వస్తుంది. అయితే..రిపోర్ట్ మాత్రం రెండు మూడ్రోజుల తర్వాత ఇస్తారు.
2) పాయింట్ ఆఫ్ కేస్ (పీసీఆర్) : పీసీఆర్ ఆటోమేటెడ్ టెస్ట్ ఛార్జీని RO50 గా నిర్ధారించింది వైద్య ఆరోగ్య శాఖ. ఈ విధానంలో కూడా ముక్కు నుంచి స్వాబ్ తీసుకుంటారు. 45 నిమిషాల్లో టెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఒక్క రోజులోనే రిపోర్ట్ ఇస్తారు.
3) సిరోలాజికల్ టెస్ట్: రక్త నమూనాలను పరక్షీంచటం ద్వారా గతంలో సోకిన ఇన్ఫెక్షన్ తాలుకు వివరాలను ఇన్వెస్టిగేట్ చేయటానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. లక్షణాలు లేకుండా కరోనా వచ్చి వెళ్లినా ఈ విధానం ద్వారా తెలుసుకోవచ్చు. గంటల టెస్ట్ రిజల్ట్ వస్తుంది. రెండు గంటల్లో రిపోర్ట్ ఇస్తారు. సిరోలాజికల్ టెస్ట్ ఛార్జీని RO15 గా నిర్ధారించారు.
అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇతర దేశాల నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించిన నేపథ్యంలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేస్తున్న ఛార్జీలపై ఒమన్ ఫోకస్ చేసింది. తద్వారా ఒమన్ వచ్చిన వాళ్లంతా తప్పనిసరిగా ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేకుండా ప్రవాసీయులకు ఊరట కలుగుతుంది. పీసీఆర్ టెస్ట్ కరోనా నెగటీవ్ వస్తే తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు కోరేందుకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- 5లక్షల టిక్కెట్లను రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- ఈద్ అల్ అదా..యూఏఈలో 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..!!
- ఎబోలా.. ప్రయాణికుల ఆరోగ్య పర్యవేక్షణపై ఒమన్ సర్క్యులర్..!!
- ఖతార్ లో ప్రైవేట్ కు మూడు రోజులపాటు ఈద్ అల్-అధా సెలవులు..!!
- 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- హజ్ కోసం అల్-మషైర్ మెట్రో ప్రారంభం..!!
- అవనిగడ్డలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!









