వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజం రావాలి:సీపీ వీసీ సజ్జనార్
- August 16, 2020
హైదరాబాద్:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కార్ఖానాలోని జనక్ పూరి కాలనీ ఏబీఎం ప్లాజా లోని ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ కు /మెడికల్ హోమ్ సెంటర్/ వృద్ధాశ్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ జెండావిష్కరణ చేశారు. అనంతరం జన గణ మన జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్రయ సమర యోధుల చిత్రపతాలకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, సురక్షిత కోసం, అభివృద్ధి కోసం ప్రతీఒక్కరూ పునరంకితం కావాలన్నారు.ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ని సందర్శించడం ఉందన్నారు.
వృద్ధుల ఆశ్రయం కోసం, వారి వైద్య సాయనికై ఇంత మంచి మెడికల్ హోమ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నప్పటికీ.. అదే సమయంలో వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజం రావాలన్నారు. రానున్న రోజుల్లో వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలన్నారు.
డాక్టర్ రామకృష్ణ తనకు రెండు సంవత్సరాలుగా తెలుసునని.. ఆయన సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారన్నారు. ఆయన సమాజానికి ఇంకా సాయం చేసే శక్తిని ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.నేటి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని... కంటికి రెప్పలా కాపాడుకుంటూ కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వారి పిల్లలు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కంటికి కనిపించే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారి బాగోగులను తీసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనన్నారు.
వస్తువులు డబ్బు పేరు రావచ్చు, పోవచ్చు... కానీ తల్లిదండ్రులే నిజమైన ఆస్తి, సంపద అని నేటి యువత గుర్తించాలన్నారు. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటేనే వారి ఆశీస్సులతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలమన్నారు.
వృద్ధాశ్రమానికి సహాయపడుతుందని స్థానిక కార్ఖానా పోలీసులకు, డాక్టర్ రామకృష్ణ ఆయన బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డాక్టర్ రామకృష్ణ ను సమాజానికి ఆయన చేస్తున్న సేవకు గాను శాలువా తో సత్కరించారు. తన వంతుగా వారికున్న పరిమితుల్లో డాక్టర్ రామకృష్ణ సమాజానికి సేవ చేస్తున్నారని.. ప్రతీ ఒక్కరూ సమాజానికి తమవంతుగా సేవ చేయాలన్నారు. సైబరాబాద్ పోలీసులు తరుపున ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ కు ఏదైనా సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమన్నారు.
కార్యక్రమం చివరలో సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ వారు డొనేట్ చేసిన ఆటోమేటెడ్ శానిటైజర్ ను సీపీ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ సరైన సమయానికి సరిన వైద్య సాయం అందక దురదృష్టవశాత్తూ తన తల్లి గారైన రాములమ్మ చనిపోయారన్నారు.. తనలా మరెవరికీ అలాంటి పరిస్తితి రావద్దని ఉద్దేశంతో 11 సంవత్సరాల క్రితం ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ను నెలకొల్పామన్నారు.
జెండావిష్కరణకు విచ్చేసి.. వయో వృద్ధులలో కొండంత నమ్మకాన్ని, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపిన సీపీ సజ్జనార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ సాయం కావాలనుకున్న వారు, సాయం చేయాలనుకునే వారు [email protected]. Phone numbers +91 99599 32323, 040 – 27832323 సంప్రదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ డాక్టర్ రామకృష్ణ, ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ మేనేజర్ నాగబూషణం, డాక్టర్ ఛత్రి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రమోద్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆనంద్, సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ వి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డైరెక్టర్ లయన్ సురేశ్ కుమార్, కార్ఖానా ఇన్ స్పెక్టర్ మధుకర్ స్వామి, ఎస్ ఐ సందీప్ రెడ్డి, ఎస్ ఐ అవినాష్, రాబిన్ హుడ్ ఆర్మీ వలంటీర్ నరేశ్, కృష్ణ చౌదరీ, జోష్ వెబ్ సైట్ వాలంటీర్లు మదన్ కుమార్, సైబరాబాద్ సీపీ పీఏ శ్రీధర్, ఆర్ఐ విష్ణు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..