'బాహుబలి' పాటలకు 'ఈగ' మాటలు

- May 24, 2015 , by Maagulf
'బాహుబలి' పాటలకు 'ఈగ' మాటలు

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'బాహుబలి' సినిమా తొలి భాగం 'బాహుబలి ది బిగినింగ్‌' పాటల విడుదల కార్యక్రమం ఈ నెల 31న హైదరాబాద్‌లో జరగనుంది. ఇదే వేదికపై రెండు నిమిషాల ఐదు సెకన్ల నిడివితో సాగే థియేట్రికల్‌ ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ''మా 'బాహుబలి' ఆడియో విడుదల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి అంగీకరించిన మా 'ఈగ'కు ధన్యవాదాలు'' అని రాసుకొచ్చారు రాజమౌళి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com