మెగాస్టార్.. చిరంజీవికి వెల్లువెత్తుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు..
- August 22, 2020
హైదరాబాద్:తెలుగు ప్రేక్షకుల్లో గుండెల్లో ఆయన వేసిన ముద్ర చెరిగిపోనిది.. సినీ పరిశ్రమలో ఆయనొక మేరు పర్వతం.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే స్వయంకృషితో ఆయన అగ్ర నటుడిగా ఎదిగారు. ఆయన జీవితం ఎంతో మంది యువ హీరోలకు స్ఫూర్తినిస్తుంది. సినీ ఇండస్ట్రీలో రికార్డుల వేట ఆయనతోనే మొదలైందని చెప్పవచ్చు. కేవలం నటనతోనే కాకుండా డ్యాన్స్, సామాజిక సేవా కార్యక్రమాలతోనూ చిరంజీవి ఎంతో అభిమానులను సంపాదించుకోగా.. ఇవాళ ఆయన ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా.. ఇవాళ చిరంజీవి పుట్టిన రోజు కనుక..!
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు మొదలుకొని, సెలబ్రిటీల వరకు అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుండగా, సామాజిక మాధ్యమాలన్నీ ఆయన బర్త్‌డే విషెస్‌తో నిండిపోతున్నాయి. ఇక ఇవాళ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు..!
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







