యాక్షన్ థ్రిల్లర్ 'రావణ లంక' ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల
- August 22, 2020
కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై క్రిష్ బండిపల్లి నిర్మాతగా బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రావణలంక. ఈ సినిమాలో క్రిష్, అశ్విత, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే రావణలంక చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో రావణలంక టీమ్ తాజాగా ఈ సినిమా అల్బమ్ లో ఉన్న మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాట ఇటీవల సోషల్ మీడియాతో పాటు యూత్ లో ఫుల్ ఫాలోయింగా తెచ్చుకున్న సుజనా తిన్నావారా అనే వాయిస్ మెసేజ్ కీలకంగా సాగుతోంది. ఈ పాటను ప్రముఖ సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ తనదైన శైలిలో అలపించారని రావణ లంక టీమ్ చెబుతోంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు రావణ లంక ఆడియో రైట్స్ దక్కించుకోవడం విశేషం. ఆదిత్య మ్యూజిక్ వారికి చెందిన వివిధ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా రావణలంక ఆడియోలోని ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
సాంగ్ లింక్
►https://youtu.be/OJ0R0G4BI1Y 🎼
ఈ సందర్భంగా చిత్ర దర్శకులు బి.ఎన్.ఎస్ రాజు మాట్లాడుతూ
రావణ లంక చిత్రాన్ని ఫుల్ యాక్షన్, కమర్షీయల్ ఎంటర్ టైనర్ గా రెడీ చేశాను. యాక్షన్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేసే ఆడియెన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేసే రీతిన రావణ లంక తెరకెక్కింది. మా సినిమా ఆడియోని ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు తీసుకోవడం చాలా ఆనందంగా, వారి లేబుల్ ద్వారి రిలీజై సూపర్ డూపర్ హిట్ అయిన పాటల సరసన మా రావణలంక ఆడియో కూడా నిలుస్తుందని మనఃస్పూర్తిగా నమ్ముతన్నారు. తాజాగా విడుదల చేసిన సువర్ణ ఇన్నావా సాంగ్ యూత్ ని కచ్ఛితంగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ పాటను ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ చాలా అద్భుతంగా పాడారు. త్వరలోనే మా సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.
నటీనటలు - క్రిష్, అశ్మిత, త్రిష, మురళిశర్మ, దేవ్ గిల్ తదితరలు
బ్యానర్ - కే సిరీస్ మ్యూజిక్ ఫ్యాక్టరీ
నిర్మాత - క్రిష్ బండిపల్లి
మ్యూజిక్ - ఉజ్జల్
సినిమాటోగ్రఫి - హజరత్ షేక్ (వలి)
ఎడిటర్ - వినోద్ అద్వయ్
పీఆర్ఓ - ఏలూరు శ్రీను
కో డైరెక్టర్ - ప్రసాద్
డైరెక్టర్ - బిఎన్ఎస్ రాజు
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?