'ఓ బేబి’ ఫేం తేజ సజ్జ హీరోగా మహతేజ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కొత్త మూవీ
- August 23, 2020
మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్
యరబోలు కలిసి నిర్మిస్తున్న మూవీ నుండి హీరో తేజ లుక్ రిలీజైంది. ఈ రోజు
తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి అతని లుక్ ను రివీల్ చేసారు
మేకర్స్. శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను మల్లిక్
రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫాంటసీ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ
సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ:
‘‘మా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ‘‘ఎస్ ఒరిజనల్స్’’ తో కలిసి
ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ
నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు
అందరం కనెక్ట్ అయ్యాం..ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం.
మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్
చేశారు..షూటింగ్ అంతా కంప్లీట్ అయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు
జరుగుతున్నాయి.ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్
చేస్తాం’’ అన్నారు.
*నటీనటులు* : తేజ సజ్జ,శివానీ రాజశేఖర్,తులసి, శివాజీ రాజా,సత్య,మిర్చి
కిరణ్,దేవీ ప్రసాద్ తదితరులు.
*సాంకేతిక నిపుణులు* :
కథ : ప్రశాంత్ వర్మ
డైలాగ్స్: లక్ష్మీ భూపాల
మ్యూజిక్: రథన్
సినిమాటోగ్రఫీ: విద్యా సాగర్
ఎడిటర్ : గ్యారీ బి.హెచ్
లిరిక్స్: కృష్ణ కాంత్
కాస్ట్యూమ్స్: సంతోషి రామ్
నిర్మాతలు: చంద్ర శేఖర్ మొగుల్ల,సృజన్ యరబోలు
దర్శకత్వం: మల్లిక్ రామ్.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







