కిరాక్ ఆర్.పి దర్శకత్వంలో జే.డి చక్రవర్తి ప్రధాన ప్రాతగా నూతన చిత్రం ప్రారంభం
- August 23, 2020
జబర్ధస్థ్ కామెడీ షోతో తెలుగు ప్రజలకి సుపరిచితమైన కమీడియన్ కిరాక్ ఆర్.పి దర్శకునిగా మారారు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కోవూరు అరుణాచలం నిర్మాతగా కిరాక్ ఆర్.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం 1 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను జే.డి చక్రవర్తి పోషిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ మూవీ ఆఫీసులో జరిగిన పూజా కార్యక్రమానికి వెండితెర, బుల్లితెర రంగాలకి చెందిన వివిధ ప్రముఖులు విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారిలో జే.డి.చక్రవర్తితో పాటు, మెగా బ్రదర్ నాగబాబు, జబర్ధస్థ్ కామెడీ షోకి చెందిన ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సందర్భంగా
దర్శకుడు కిరాక్ ఆర్.పి మాట్లాడుతూ
గత కొన్నేళ్లుగా జబర్ధస్థ్ కామెడీ షో ద్వారా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుదరడంతో దర్శకునిగా ఆడియెన్స్ ముందుకి రావడానికి నిశ్చయించుకున్నాను. నా మీద నమ్మకంతో నిర్మాత కోవూరు అరుణాచలం గారు సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చారు. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా, నా డైరక్షన్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో జేడీచక్రవర్తి కీలక పాత్ర పోషించడానికి అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో జే.డి. పాత్ర చాలా విలక్షణంగా ఉంటుంది. జే.డి.చక్రవర్తితో పాటు, ప్రకాశ్ రాజ్, రావురమేశ్, జబర్ధస్థ్ ఆదిత్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో హైదరాబాద్, నెల్లూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు.
తారాగాణం
జే.డి.చక్రవర్తి, ప్రకాశ్ రాజ్, రావురమేశ్, జబర్ధస్థ్ ఆదిత్య తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ - పద్మపూజిత పిక్చర్స్
నిర్మాత - కోవూరు అరుణాచలం
మ్యూజిక్ - చరణ్ అర్జున్
పీ.ఆర్.ఓ - ఏలూరు శ్రీను
దర్శకత్వం - కిరాక్ ఆర్.పి
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







