'గుర్తుందా శీతాకాలం' చిత్రం ఆడియో ని 75 లక్షల కి సొంతం చేసుకున్న ఆనంద్ ఆడియో
- August 24, 2020
యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీబ్యూటీ తమన్నా, నాగశేఖర్, కాలభైరవ కాంబినేషన్ లో ప్రారంభం కానున్న "గుర్తుందా శీతాకాలం" చిత్రం ఆడియో ని 75 లక్షల కి సొంతం చేసుకున్న ఆనంద్ ఆడియో
వరుసగా వినూత్న చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల హ్రుదయాల్లో సెపరెట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా, ఎవర్‌గ్రీన్ మిల్కీబ్యూటి తమన్నా జంటగా ప్రముఖ దర్శకుడు నాగశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రానికి "గుర్తుందా శీతాకాలం" అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్, భావన రవి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా, ఈ చిత్రానికి సంభందించిన ఆడియో ని 75 లక్షల కి ఫ్యాన్సి ఆఫర్ తో కన్నడ లో నెం1 ఆడియో కంపెని ఆనంద్ ఆడియో వారు సొంతం చేసుకొవటం విశేషం. అలాగే గుర్తుందా శీతాకాలం చిత్రం తో ఆనంద్ ఆడియో తెలుగు మార్కెట్ కి పరచయం అవుతున్నారు. స్వరవాణి కీరవాణి తనయుడు కాలభైరవ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ సత్యదేవ్, తమన్నా కాంబినేషన్ అనగానే తెలుగు సినిమా మార్కెట్ లో వచ్చిన క్రేజ్ మాములుగా లేదు. నాకు కంగ్రాట్స్ చెబుతూ వచ్చిన కాల్స్ కి లెక్క కూడా లేదు. అల్‌రెడి ఈ సినిమా సూపర్‌హిట్ అనే ఫీలింగ్ ని కలిగించింది. ఇంకా చిత్రం ప్రారంభించలేదు అప్పుడే ఆడియో ని కన్నడలో నెం1 ఆడియో కంపెని వారు ఆనంద్ ఆడియో తెలుగు కి మా చిత్రం ద్వారా పరిచయం అవ్వటమే కాకుండా ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి గారి కుమారుడు కాలభైరవ అందిస్తున్న మ్యూజిక్ ని ఫ్యాన్సి రేట్ కి 75 లక్షలకి కొనుగొలు చేయటం ఈ చిత్రం యెక్క మెదటి రికార్డ్ అనే చెప్పాలి. ఈ క్రేజి కాంబినేషన్ కి క్రేజి లవ్ స్టోరి కి టైటిల్ ఏం పెట్టాలి అనుకుంటున్న సమయంలో గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ని ఖరారు చేశాము. ఈ టైటిల్ విన్న వారంతా క్రేజి గా ఫీలవుతున్నారు. ఈ చిత్రానికి యాప్ట్ టైటిల్ గా చెప్తున్నారు. చాలా ప్రేమకథ లు శీతాకాలం లోనే మెదలవుతాయి.. అందుకే గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ అనగానే ప్రతిఒక్కరూ వారి ప్రేమకథని గుర్తుచేసుకుంటున్నారు. చాలా పొయోటిక్ గా ఈ టైటిల్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. అతి త్వరలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాము. అని అన్నారు
తారాగణం :
సత్య దేవ్, తమన్నా
సాంకేతిక వర్గం
బ్యానర్ : నాగ శేఖర్ మూవీస్
నిర్మాతలు : భావన రవి, నాగశేఖర్
మ్యూజిక్ : కాల భైరవ
కెమెరా : సత్య హెగ్డే
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
పీ ఆర్ ఓ - ఏలూరు శ్రీను
లైన్ ప్రొడ్యూసర్స్ - సంపత్ కుమార్, శివుదశ్ యశోదర
డైరెక్టర్ : నాగ శేఖర్
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?