రాముడిగా ప్రభాస్ పర్ఫెక్ట్: రాజమౌళి
- August 25, 2020
ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ మూడు భారీ సినిమాలు చేస్తున్నారు. మూడూ పాన్ ఇండియా చిత్రాలు. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న చిత్రాలివి. అందులో `రాధేశ్యామ్` ప్రస్తుతం తెరకెక్కుతుండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ చేయబోతున్నాడు. దీంతోపాటు అందరిని సర్‌ప్రైజ్ చేస్తూ గత వారం `ఆదిపురుష్` పేరుతో ఓ పౌరాణిక ప్రాజెక్ట్ ని ప్రభాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రాముడిపై ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు.
తాజాగా `ఆదిపురుష్` ప్రాజెక్ట్ పై దర్శకుధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి అందరికంటే ముందు తనకే తెలుసన్నారు. ఆయన చెబుతూ, `ఆదిపురుష్` చిత్ర పోస్టర్‌ని అందరికంటే ముందే చూశా. అద్భుతంగా ఉంది. రాముడి పాత్రకి ప్రభాస్ పర్‌ఫెక్ట్ యాప్ట్, ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. ఈ సమయంలో రాముడిపై సినిమా తీయడం అభినందనీయం` అని చెప్పారు.
`దేశం మొత్తం రాముడి గురించి చర్చ జరుగుతుండగా, ఆయనపై సినిమా వస్తే దానికి మరింత క్రేజ్ వస్తుంది. అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచుతుంది. సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. విజువల్ వండర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఆయన `ఆర్ ఆర్ ఆర్` పేరుతో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతుంది. ఇది కూడా గ్రాండియర్‌గా రూపుదిద్దుకుంటోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







