అబుధాబిలో 520 బస్సుల్లో ఇంటర్నెట్ ఉచితం
- August 25, 2020
అబుధాబిలో 520 బస్సుల్లో ప్రయాణించేవారికి ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ (ఐటిసి) ఈ మేరకు తొలి ఫేజ్ ప్రాజెక్టుని పూర్తి చేసింది. అన్ని పబ్లిక్ బస్సుల్లోనూ వైఫై ద్వారా ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. తొలి ఫేజ్‌లో మొత్తం 520 బస్సుల్లో 410 అబుదాబీ సిటీలోనూ, మరో 110 బస్సులు అల్ అయిన్ సిటీలోనూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందుతున్నాయి. ‘డు’ సంస్థతో ఐటిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం పెంచేలా తెచ్చిన మార్పుల్లో ఇదీ ఓ భాగం. బస్ షెల్టర్లు అలాగే మెయిన్ బస్టాండ్లలోనూ వైఫై అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







