ఒమాన్ లో అత్యవసర మార్గం మీద వాహనాన్ని నడిపిస్తే వారికి... ఏ శిక్ష విధించాలి ??
- February 08, 2016
ఒమాన్ లో అత్యవసర మార్గం మీద వాహనాన్ని నడిపినవారిని 48 గంటల పాటు నిర్బంధించి తర్వాత చర్య కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచిస్తామని రాయల్ ఒమాన్ పోలీస్ వాహనదారులను హెచ్చరిస్తూ ట్విట్ చేసింది. ఒమన్లో ప్రధాన రహదారిలో ఒక అత్యవసర మార్గం ఎపుడూ కొనసాగుతూ ఉంటుందని , అంబులెన్సు వంటి అత్యవసర వాహనాల కోసం అవి కేటాయించినివని పలువురు గ్రహించడం లేదని పేర్కొన్నారు. కొందఱు వాహనదారులు ట్రాఫిక్ రద్దీ నుంచి సులువుగా తప్పుకొనేందుకు ఈ అత్యవసర మార్గాన్ని ఎంచుకోవడం ట్రాఫిక్ ఉల్లంఘన నేరంగా కింద పరిగణించాల్సివస్తుందని పేర్కొన్నారు. ఒమాన్ పోలీసులు ట్విట్ చేసిన సూచన సామాజిక మాధ్యమంలో పలువురు స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓపికతో తమకు నిర్దేశించబడిన దారిలోనే ప్రయాణిస్తే, అనవసర్ ట్రాఫిక్ రద్ది తగ్గడమే కాక పలు రోడ్డు ప్రమాదాలను నివారించ గలుగుతామని తెలిపారు. వాహనదారులలో ఎక్కువమంది తాము మాత్రమె బిజీ అని, తమ సమయం మాత్రమె అమోల్యమైనధన్నట్లు ప్రవర్తిస్తారని పేర్కొంటూ, వారికే ఈ సందర్భంగా ఒక సలహా ఇచ్చేరు. కొంతమంది వేగంగా గమ్యానికి చేరాల్సిన అవసరం ఉండవచ్చని, తాము ( పోలీస్ ) పట్టుకొన్న తర్వాత వారి వద్ద అందుకు సంబంధించిన ఆధారాలను చూపితే, వారిని ట్రాఫిక్ కేసు నుంచి కొంత ఉపసమనం పొందే అవకాశం ఇవ్వనున్నట్లు రాయల్ ఒమాన్ పోలీస్ వివరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







