బొమ్మాకు క్రియేషన్స్ లో రామ్ గోపాల్ వర్మ నిజ జీవిత సినిమా
- August 25, 2020
హైదరాబాద్:బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితాన్ని 3 భాగాల, 3 చిత్రాలుగా నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన పార్ట్ 1 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు 26 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు . 3 చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుంది మొత్తం 3 చిత్రాలు కలిపి 6 గంటలు. బొమ్మాకు మురళి నిర్మాణంలో రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో "దొరసాయి తేజ" ఈ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నాడు . సెప్టెంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పార్ట్ 1 లో 20 ఏళ్ళ ఆర్జీవీ లాగా ఒక కొత్త యువ నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 సినిమాలో లో వేరే నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 3 లో ఆర్జీవీ యే స్వయంగా ఆర్జీవీగా నటించబోతున్నారు . 3 పార్టుల్లో ,ఒక్కొక్క పార్టు ఆర్జీవీ గారి జీవితం లోని ఆయన వేరు వేరు వయసుల్లో జరిగిన వేరు వేరు అంశాలను చూపెట్టబోతోంది.
మొదటి భాగం సినిమా పేరు "రాము " రామ్ గోపాల్ వర్మ ఆరంభం. దీంట్లో ఆయన విజయవాడ కాలేజ్ రోజులు, ఆయన తొలి ప్రేమలు, అప్పట్లో ఆయన పాల్గొన్న గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి , ఆయన శివ సినిమా చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడు, రిలేన్ షిప్స్ ను ఎలా మాయ చేసి వాడుకున్నాడు అన్నది ప్రధాన కథాంశం గా చూపెట్టబోతోంది. పార్ట్ 2 "రామ్ గోపాల్ వర్మ" అండర్ వరల్డ్ తో ప్రేమాయణం. ఇది తన ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ మరియు అమితాబ్ బచ్చన్ లతో ఆయనకున్న అనుబంధాల గురించి చూపెట్టబోతోంది. పార్ట్ 3 "RGV” ది ఇంటెలిజెంట్ ఇడియట్. ఇది ఆయన ఫెయిల్యూర్లు, వివాదాలు, ఆయనకున్న దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల ఉన్న విపరీత వైఖరులతో పాటు చాలా మంది మీద ఆర్జీవీ ప్రభావం గురించి చూపెట్టబోతోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







