కోవిడ్ మరణాలపై అసత్య ప్రచారం..యూఏఈలో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

- August 26, 2020 , by Maagulf
కోవిడ్ మరణాలపై అసత్య ప్రచారం..యూఏఈలో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

యూఏఈ: కరోనా మహమ్మారికి సంబంధించి ప్రజలను భయబ్రాంతులు చేసేలా ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినా సహించేది లేదని యూఏఈ హెచ్చరించింది. కోవిడ్ మరణాలకు సంబంధించి యూఏఈలోని ఓ ఛానెల్ ప్రసారమైన వార్తపై యూఏఈ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోహాలు సృష్టించేలా వార్త కథనాలను ప్రసారం చేసిన సదరు ఛానెల్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కోవిడ్ 19 వల్లే ఓ కుటుంబం చనిపోయినట్లు ప్రసారమైన వార్త పూర్తి నిరాధారణమైనది, అసత్యాలతో కట్టుకథలను ప్రసారం చేశారన్నది ప్రాసిక్యూషన్ వాదన. అసత్య ప్రచారం చేసిన వార్త కథనం వెనక అసలు నిజానిజాలు ఎంటో, కథనాల వెనక ఎవరెవరు ఉన్నారో వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోందని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోవిడ్ 19కి సంబంధించి ఏ రూపంలో అసత్య ప్రచారం జరిగినా అందుకు బాధ్యులైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com