డబుల్ బెడ్ రూమ్ పథకంలో టాటా గ్రూప్ : కేటీఆర్
- February 08, 2016
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్ అంగీకరించిందని మున్సిపల్, ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ఆయన ముంబైలో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో టాటా ఏఐజీ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు టీ-హబ్ ఇన్నోవేషన్ ఫండ్ కు టాటా క్యాపిటల్ తో సహకారం అందించనున్నారని కేటీఆర్ తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ఆసక్తిగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







