‘వి’ చిత్రం యొక్క అద్భుతమైన ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్

- August 26, 2020 , by Maagulf
‘వి’ చిత్రం యొక్క అద్భుతమైన ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్

ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా కేటాయించిన వెబ్‌సైట్‌లో V చిహ్నాన్ని తయారుచేస్తూ అభిమానులు భారీ సంఖ్యలో పంచుకున్న చిత్రాలతో, ఒక అద్భుతమైన ఫోటో మొజాయిక్ మూవీ పోస్టర్‌ను స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం విడుదల చేసింది.

మోహన కృష్ణ ఇంద్రగంటి రచన మరియు దర్శకత్వంలో రానున్న ఈ తెలుగు థ్రిల్లర్ లో నేచురల్ స్టార్ నాని & సుధీర్ బాబుతో పాటు నివెతా థామస్ మరియు అదితి రావు హైదరి ప్రముఖ పాత్రల్లో నటించారు.

భారతదేశంలో మరియు 200 దేశాలు మరియు టెర్రిటోరియాస్ లో ఉన్న ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 5 న విడుదల అవుతున్న తెలుగు టైటిల్ V యొక్క డిజిటల్ ప్రీమియర్‌ను ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
సరికొత్త మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ షోలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటన-రహితంగా మ్యూజిక్ వినడం కోసం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచిత, వేగవంంతమైన డెలివరీ, టాప్ డీల్స్ యాక్సెస్, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమితమైన పఠనం మరియు ప్రైమ్ గేమింగ్‌తో మొబైల్ గేమింగ్ కంటెంట్ అమెజాన్ ద్వారా పొందవచ్చు. ఇవన్నీ కేవలం నెలకు 129 రూపాయల అద్భుతమైన విలువతో అమెజాన్ ప్రైమ్ మీకోసం అందిస్తుంది.

నేషనల్, ఇండియా, 26 ఆగస్టు, 2020: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క తెలుగు యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ‘వి’ చిత్రానికి సంబంధించి ఈ రోజు ఒక అసాధారణమైన ట్రైలర్ లాంచ్ తో అమెజాన్ ప్రైమ్ ఉత్సాహాన్ని పెంచింది! అభిమానులు ఉత్సాహంగా చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తుండటంతో, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ట్రైలర్ లాంచ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఒక వెబ్‌సైట్‌ను సృష్టించింది, ఇందులో అద్భుతమైన ఫోటో మొజాయిక్ మూవీ పోస్టర్‌ కలిగి ఉంది, ఈ పోస్టర్ లో ప్రపంచవ్యాప్తంగా 6,45,543 మంది అభిమానుల చిత్రాలు ఉన్నాయి. !

ఈ ట్రైలర్ ద్వారా ఒక క్రైమ్ రచయితతో ప్రేమలో పడిన ఒక పోలీసు, ఎంతో ఆనందంతో నిండిన అతని జీవితంలో, ఒక కిల్లర్ ప్రవేశించడంతో, అతనికి ఎదురయిన ఒక పజిల్‌ను పరిష్కరించడం కోసం ఎదుర్కొంటున్న సవాళ్లతో ఆయన జీవితం కొత్త మలుపులు తీసుకుంటుంది. మంచికి చెడుకి మధ్య జరిగే షోడౌన్, హెవీ-డ్యూటీ యాక్షన్, ఉల్లాసభరితమైన రొమాన్స్ మరియు హాస్యంతో కూడిన ఈ డ్యూయె పరిణామాలను తెలిపే విధంగా ట్రైలర్ ఉంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నేచురల్ స్టార్’ నాని, సుధీర్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు, నివేత థామస్ మరియు అదితి రావు హైదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారతదేశంలో మరియు 200 దేశాలు మరియు టెర్రిటోరియాస్ లో ఉన్న ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 5 న విడుదల అవుతున్న తెలుగు చిత్రం 'వి' యొక్క డిజిటల్ ప్రీమియర్‌ను వీక్షించవచ్చు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ లాంచ్ గురించి, ‘నేచురల్’ స్టార్ నాని మాట్లాడుతూ, “ఏ ఆర్టిస్టుకైనా, అభిమానులు వారిని ప్రేమతో, ప్రశంసలతో ముంచెత్తడం చూస్తే, వారికి ప్రపంచానికి వెలుపల ఉన్న అనుభూతి కలుగుతుంది! ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది - ఇది నా 25 వ చిత్రం. ఈ ప్రత్యేకమైన విడుదల ద్వారా నా అభిమానులందరినీ గౌరవించటానికి ఇంత ఆసక్తికరమైన మార్గాన్ని కనుగొనడం నిజంగా ఉత్తేజకరమైనది. ఈ ట్రైలర్ లో చూపించినట్టుగా సినిమా కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ ప్యాక్డ్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్‌తో మంచి అనుభూతిని ఇస్తుందని వాగ్ధానం చేస్తున్నాను. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు దర్శకుడు మోహన కృష్ణతో ఇది నా 3 వ చిత్రం. వారితో పనిచేయడం నాకు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది.”

ట్రైలర్ గురించి వ్యాఖ్యానిస్తూ, సుధీర్ బాబు, “అభిమానులు భారీ విడుదల వాతావరణాన్ని ఆనందిస్తారు. ఈ సారి ఈ ఆనందాన్ని మేము వారి నుండి దూరం కావడానికి ఇష్టపడడం లేదు. ట్రైలర్ లాంచ్‌లో అభిమానులు పాల్గొనడం నాకు చాలా సంతోశాన్ని కల్గించింది. వారే ఎల్లప్పుడూ నాకు బలం. 'వి' చిత్తం ఒక యాక్షన్ డ్రామా, ఇది వారి నిరీక్షణకు తగిన విలువిస్తుంది. మా సామూహిక ప్రయత్నాలు ప్రశంసించబడతాయి, దాని గురించి నాకు ఖచ్చితంగా తెలుసు. ట్రైలర్ కోసం వచ్చిన భారీ స్పందన దానికి సూచన" అని అన్నారు

నటి నివేదా థామస్ కూడా ట్రైలర్ సంపాదించిన ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపారు. వీరు మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ, వారు నిరంతరం చూపిస్తున్న మద్దతు మరియు ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను! వారు మా చిత్రం 'వి' యొక్క ట్రైలర్ లాంచ్ ను చాలా ప్రత్యేకమైనదిగా మార్చారు. 'వి'చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. మరియు ప్రేక్షకులు సినిమా చూడటానికి మరియు వారి అభిప్రాయాలను పంచుకునే వరకు నేను వేచి ఉండలేను.” అని అన్నారు.

ట్రైలర్‌లో తన ఆలోచనలను పంచుకుంటూ, నటి అదితి రావు హైదరి మాట్లాడుతూ, "అభిమానులు మాపై చూపించిన అమూల్యమయిన ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. వారి ప్రేమ మరియు మద్దతు మమ్మల్ని ప్రతిసారీ కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. 'వి' చిత్రం నానికి ఒక అద్భుతమైన ట్రిబ్యూట్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నానికి 25 వ చిత్రం." అని అన్నారు

కధ సారాంశం:
ఒక ప్రఖ్యాత పోలీసు మరియు సీరియల్ కిల్లర్ మధ్య జరిగే షోడౌన్, అతన్ని పట్టుకోవటానికి చేసే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్ల, ఫలితంగా హెవీ-డ్యూటీ యాక్షన్, ఉల్లాసభరితమైన రొమాన్స్ మరియు హాస్యంతో కూడిన థ్రిల్లర్. దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ‘నేచురల్ స్టార్’ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలలో నటించారు.

సంగీతం: అమిత్ త్రివేది
నేపధ్య సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: పి.జి విందా
కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్

‘వి’ చిత్రం ప్రైమ్ వీడియో కేటలాగ్‌లో హాలీవుడ్ మరియు బాలీవుడ్ నుండి వేలాది టీవీ షోలు మరియు సినిమాల జాబితాలో చేరనుంది. భారతీయ చిత్రాలైన గులాబో సీతాబో, శకుంతల దేవి, పొన్మగల్ వంధల్, లా, ఫ్రెంచ్ బిర్యానీ, సుఫియం సుజాతాయమ్ మరియు పెంగ్విన్లతో పాటు భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్ బండిష్ బండిట్స్, బ్రీత్: ఇంటు ది షాడోస్, పాటల్ లోక్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, ది ఫ్యామిలీ మ్యాన్, ఇన్ సైడ్ ఎడ్జ్, మరియు మేడ్ ఇన్ హెవెన్ మరియు టామ్ క్లాన్సీ యొక్క జాక్ ర్యాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లీబాగ్ మరియు ది మార్వెలస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డు గెలుచుకున్న మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అదనపు ఖర్చు లేకుండా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ మరియు బెంగాలీ భాషలలో అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ టీవీలు, మొబైల్ పరికరాలు, ఫైర్ టివి, ఫైర్ టివి స్టిక్, ఫైర్ టాబ్లెట్లు, ఆపిల్ టివి, ఎయిర్‌టెల్, వొడాఫోన్ మొదలైన వాటి కోసం అందుబాటులో ఉన్న ప్రైమ్ వీడియో యాప్‌లో ప్రైమ్ సభ్యులు ‘వి’ చిత్రాన్ని ఎక్కడైనా మరియు ఎప్పుడైనా చూడగలరు. ప్రైమ్ వీడియో అనువర్తనంలో, ప్రైమ్ సభ్యులు వారి మొబైల్ పరికరాలు మరియు టాబ్లెట్‌లలో ఎపిసోడ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు అదనపు ఖర్చు లేకుండా ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా చూడవచ్చు.

ప్రైమ్ వీడియో భారతదేశంలో సంవత్సరానికి ₹999 లేదా నెలకు ₹129 తో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తుంది, కొత్త కస్టమర్లు www.amazon.in/prime పై క్లిక్ చెయ్యడం ద్వారా మరింత తెలుసుకోవచ్చు మరియు 30 రోజుల ఉచిత ట్రయల్‌కు సుబ్స్క్రిప్షన్ పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com