వారికి అండగా ఉండండి- హీరో సుమన్
- August 26, 2020
ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని ప్రముఖ నటుడు సుమన్ తన అభిమానులకు సూచించారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది నా అభిమానులు కేకులు కట్ చేయడం, హడావుడి చేయడం చేస్తుంటారు. అయితే ఈ సారి కరోనా కారణంగా ప్రజలు గుమికూడే పరిస్థితి లేదు. పైగా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే అభిమానులు హడావుడి చేయకూడదని సూచిస్తున్నాను. వీలైతే కరోనా నుండి ప్రజలను కాపాడ్డం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్లకు, పోలీసులకు, వైద్య సిబ్బందికి అండగా ఉండాలని, వారికి సేవలు అందించాలని సుమన్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా తను ఇంటికే పరిమితం అయినట్టుగా సుమన్ తెలిపారు. తన నట జీవితంలో ఇంతటి ఇన్ని రోజులు షూటింగ్ చేయకుండా ఉండలేదని అన్నారు. షూటింగ్ లో పాల్గొనడానికి త్వరలోనే పరిస్థితులు అనుకూలంగా మారతాయని ఆశిస్తున్నాను. మధ్యలో నిలిచిపోయిన చిత్రాలను పూర్తిచేయాల్సి ఉందని సుమన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?