మరిన్ని ప్రైవేటు కేంద్రాలకు 'మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌' సర్వీసులు

- February 08, 2016 , by Maagulf
మరిన్ని ప్రైవేటు కేంద్రాలకు 'మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌' సర్వీసులు

ఆన్‌లైన్‌ ద్వారా మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ సర్వీసులు చాలావరకు ప్రైవేటు లైసెన్సు కేంద్రాల ద్వారా సామాన్యులకు, కంపెనీలకు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ప్రైవేటు కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2011లో మినిస్ట్రీ, 96 లైసెన్సుల్ని మంజూరు చేసింది. సర్వీసులు ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్న లైసెన్సుడు కేంద్రాలు కొంత ఫీజును ఆయా సర్వీసుల కోసం వసూలు చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మినిస్ట్రీకి చెందిన సర్వీసు సెంటర్ల వద్ద రద్దీ తగ్గింది. మినిస్ట్రీ వర్కింగ్‌ అవర్స్‌ తర్వాత కూడా సేవలు ప్రైవేటు సెంటర్స్‌ ద్వారా లభిస్తున్నాయి. ఖతార్‌ పోస్ట్‌తో అనుసంధానమై ఐడీ కార్డులు వంటి సేవల్ని వినియోగదారులకు అందజేస్తున్నాయి. సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా ఎలాంటి ట్రాన్జాక్షన్‌ చేయడానికి ఈ ప్రైవేటు కేంద్రాలకు అనుమతి లేదు. పూరిస్థాయి జాగ్రత్తలతోనే సర్వీసులను అందించవలసి ఉంటుంది. చట్టాల ప్రకారం, నిబంధనల మేరకు సేవలు అందిస్తున్న ప్రైవేటు కేంద్రాల సంఖ్యను ఇంకా పెంచాలని మినిస్ట్రీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com