ట్రాఫిక్ పాయింట్స్ సిస్టమ్ నేటి నుంచి అమలు
- February 08, 2016
బహ్రెయిన్‌లో నేటినుంచి న్యూ పాయింట్స్ సిస్టమ్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి అమల్లోకి వచ్చింది. అధికారిక వర్గాలు దీనిపై నిన్ననే స్పష్టమైన ప్రకటన చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదనీ, కఠిన చర్యలు తప్పవు గనుక ప్రతి ఒక్కరూ రోడ్లపై బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ షేక్ నాజర్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా చెప్పారు. ఏడాది కాలానికిగాను అంటే 365 రోజులకు నిబంధనల ఉల్లంఘన పాయింట్లు 20గా నిర్ణయించారు. ఈ పాయింట్లను ఎవరైనా అధిగమిస్తే, అలాంటివారి లైసెన్స్ రద్దు చేయబడుతుంది. తొలి ఉల్లంఘన నుంచే కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. తొలిసారి 20 పాయింట్లను అధిగమించిన తర్వాత 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. రెండోసారి కూడా 20 పాయింట్లను దాటేసినట్లయితే 6 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం, వాహనానికి సంబంధించినది కాకుండా వేరే లైసెన్స్‌తో ఏదైనా వాహనాన్ని నడపడం, తప్పు పద్ధతిలో ఓవర్‌టేకింగ్ చేయడం, ఒకరు లేదా అంతకు మించిన వ్యక్తులను రోడ్డు ప్రమాదంలో గాయపర్చడం, అధికారిక మరియు అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోవడం లాంటి నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, పలు రకాలుగా పాయింట్లను లెక్కిస్తారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







