హైదరాబాద్ లో డాక్టర్స్ మధ్య కాల్పులు
- February 08, 2016
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. స్ట్రీట్ నెం.6లో ఓ కారులో కాల్పులు జరిగాయి. వ్యాపార భాగస్వామ్యంలో ముగ్గురు డాక్టర్ల మధ్య వివాదం నెలకొనడం దీనికి కారణమైందని సమాచారం. ఒకే కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు డాక్టర్ల మధ్య మాటామాటా పెరగడంతో ఉదయ్‌కుమార్ అనే డాక్టర్‌పై శివకుమార్ అనే మరో డాక్టర్ కాల్పులు జరిపాడు. దీంతో చెవి పక్కనుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఉదయ్‌కుమార్, శశికుమార్‌లు ఇద్దరూ వైద్యులే కావడం విశేషం.
ఆస్పత్రి లావాదేవీలకు సంబంధించి వీరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. హిమాయత్‌నగర్ వీధి నెం.6లోని రాజా రెసిడెన్సీ లో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వైద్యులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







