మరిన్ని ప్రైవేటు కేంద్రాలకు 'మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్' సర్వీసులు
- February 08, 2016
ఆన్లైన్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సర్వీసులు చాలావరకు ప్రైవేటు లైసెన్సు కేంద్రాల ద్వారా సామాన్యులకు, కంపెనీలకు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ప్రైవేటు కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2011లో మినిస్ట్రీ, 96 లైసెన్సుల్ని మంజూరు చేసింది. సర్వీసులు ఆన్లైన్ ద్వారా అందిస్తున్న లైసెన్సుడు కేంద్రాలు కొంత ఫీజును ఆయా సర్వీసుల కోసం వసూలు చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మినిస్ట్రీకి చెందిన సర్వీసు సెంటర్ల వద్ద రద్దీ తగ్గింది. మినిస్ట్రీ వర్కింగ్ అవర్స్ తర్వాత కూడా సేవలు ప్రైవేటు సెంటర్స్ ద్వారా లభిస్తున్నాయి. ఖతార్ పోస్ట్‌తో అనుసంధానమై ఐడీ కార్డులు వంటి సేవల్ని వినియోగదారులకు అందజేస్తున్నాయి. సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా ఎలాంటి ట్రాన్జాక్షన్ చేయడానికి ఈ ప్రైవేటు కేంద్రాలకు అనుమతి లేదు. పూరిస్థాయి జాగ్రత్తలతోనే సర్వీసులను అందించవలసి ఉంటుంది. చట్టాల ప్రకారం, నిబంధనల మేరకు సేవలు అందిస్తున్న ప్రైవేటు కేంద్రాల సంఖ్యను ఇంకా పెంచాలని మినిస్ట్రీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







