హైదరాబాద్ లో డాక్టర్స్ మధ్య కాల్పులు

- February 08, 2016 , by Maagulf
హైదరాబాద్ లో డాక్టర్స్ మధ్య కాల్పులు

హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. స్ట్రీట్‌ నెం.6లో ఓ కారులో కాల్పులు జరిగాయి. వ్యాపార భాగస్వామ్యంలో ముగ్గురు డాక్టర్ల మధ్య వివాదం నెలకొనడం దీనికి కారణమైందని సమాచారం. ఒకే కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు డాక్టర్ల మధ్య మాటామాటా పెరగడంతో ఉదయ్‌కుమార్ అనే డాక్టర్‌పై శివకుమార్ అనే మరో డాక్టర్ కాల్పులు జరిపాడు. దీంతో చెవి పక్కనుంచి బుల్లెట్‌ దూసుకెళ్లింది. ఉదయ్‌కుమార్‌, శశికుమార్‌లు ఇద్దరూ వైద్యులే కావడం విశేషం.
ఆస్పత్రి లావాదేవీలకు సంబంధించి వీరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. హిమాయత్‌నగర్‌ వీధి నెం.6లోని రాజా రెసిడెన్సీ లో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వైద్యులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com