జర్నలిస్ట్ లకు 100 ఎకరాల్లో ఇళ్లు కట్టించనున్న తెలంగాణా ప్రభుత్వం..!!
- February 08, 2016
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగు ముందుకు వేశారు. సోమవారం సీఎం కేసీఆర్ అధికారులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.తొలి దశలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో జర్నలిస్టులకు నివాస గృహాలు నిర్మించాలని నిర్ణయించారు. నగర శివారులోని బుద్వేల్ ప్రాంతంలో 100 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అక్కడ త్వరలో నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
దశల వారీగా జర్నలిస్టులందరికీ నివాస గృహాలు నిర్మించాలని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







