లండన్ వీధుల్లోకి రానున్న గూగుల్ డ్రైవర్ రహిత కార్లు..!!
- February 08, 2016
గూగుల్ సంస్థ తన డ్రైవర్ రహిత కారును అమెరికాలోని పలు ప్రాంతాల్లో పరీక్షించింది. తాజాగా వాషింగ్టన్ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించింది. యూకే రాజధాని లండన్ వీధుల్లో కూడా గూగుల్ డ్రైవర్ రహిత కారును పరీక్షించనున్నట్లు స్కై న్యూస్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి గత మూడు సంవత్సరాల కాలంలో ఆరుసార్లకు పైగా లండన్ స్థానిక రవాణాశాఖ అధికారులు గూగుల్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమచారం. అమెరికా రహదారులతో పోలిస్తే లండన్ వీధుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షించనున్న డ్రైవర్ రహిత కారు పట్ల తాము ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు స్థానిక ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ మేయర్ ఇసాబెల్ డెడ్రింగ్ స్కై న్యూస్‌కు తెలిపారు.
అయితే ఎంత వేగంతో కారును పరీక్షిస్తారో తెలియాల్సి ఉంది. అదే విధంగా లండన్ ట్రాఫిక్ నిబంధనలు సైతం డ్రైవర్ రహిత కారుకు అవరోధం కానున్నాయి.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







